అక్కినేని అఖిల్ హీరోగా స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి రూపొందిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఏజెంట్. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని అనిల్ సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అఖిల్ ఈ మూవీ కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీ చూస్తుంటే… అఖిల్ ఎంతలా క‌ష్ట‌ప‌డ్డాడో తెలుస్తుంది.
ఇక ఈ మూవీ టీజ‌ర్  ఈరోజు (15)సాయంత్రం 5.05 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ ఈవెంట్ ను హైద‌రాబాద్ లోని మ‌ల్లిఖార్జున థియేట‌ర్లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మధ్యాహ్నం 3 గంట‌ల నుంచి స్టార్ట్ కానుంది. ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ కాకుండానే 75 కోట్ల బిజినెస్ ఆఫ‌ర్స్ రావ‌డం విశేషం. ఇక టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత ఈ మూవీ పై మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి.. టీజ‌ర్ తో ఏ రేంజ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *