Wednesday, April 2, 2025
HomeTrending NewsAgniveer: అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి

Agniveer: అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. మొదటి బ్యాచ్‌లో మొత్తం 2,585 అగ్నివీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 272 మంది మహిళా అగ్నివీరులు ఉండడం విశేషం. సాధారణంగా పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను ఉదయం వేళల్లో నిర్వహిస్తారు. అయితే భారత సాయుధ దళాల చరిత్రలో మొదటిసారిగా రాత్రి పూట పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌. హరి కుమార్.. అగ్నివీరుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఆసియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు వద్ద శిక్షణ పొందిన ఈ అగ్నివీర్‌లను సముద్ర శిక్షణ కోసం ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకల్లో మోహరిస్తామని అధికారులు తెలిపారు. భారత నౌకాదళంలో తొలిసారిగా మహిళలు నావికులుగా నియమితులయ్యారని చెప్పారు. అగ్నివీర్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2022, జూన్‌ 14న ప్రారంభించింది. తొలిసారిగా ఇండియన్‌ నేవీ అగ్నివీరులను రిక్రూట్‌ చేసుకున్నది. గతేడాది డిసెంబర్‌ 7న ఐఎన్‌ఎస్‌ చిల్కా వద్ద మొదటి బ్యాచ్‌కు శిక్షణను ప్రారంభించారు.

Also Read : అగ్నివీర్ లకు పది శాతం రిజర్వేషన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్