Saturday, July 27, 2024
Homeసినిమాసుమంత్ “అహం రీబూట్” ఫస్ట్ లుక్ రిలీజ్

సుమంత్ “అహం రీబూట్” ఫస్ట్ లుక్ రిలీజ్

Reboot-first look: సుమంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం అహాం రీబూట్. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అహం రీబూట్ సినిమా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్…సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని సుప్రసిద్ధ ర‌చ‌యిత విజయంద్ర ప్ర‌సాద్ లాంఛ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ఈ కాన్సెప్ట్ విన‌గానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇలాంటి క‌థ‌ల‌కు ఇప్పుడు డిమాండ్ మ‌రింత పెరిగింది.  సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో న‌టిస్తున్న సుమంత్ కి అభినంద‌న‌లు. నిర్మాతలు ర‌ఘువీర్, సృజ‌న్ య‌ర‌బోలు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగ‌ర్ కు ఇత‌ర టెక్నీష‌న్స్ కు ఆల్ ద బెస్ట్ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. అహాం రీ బూట్ తో ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియన్స్ ల‌ను అందించ‌బోతున్నాం. అనుకోని సంఘ‌ట‌ల‌ను మ‌నిషిలోని కొత్త కోణాల‌ను, శ‌క్తుల‌కు బ‌య‌ట‌కు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి క‌థే అహాం రిబూట్. సుమంత్ న‌ట‌న చాలా హైలెట్ గా ఉంటుంది. ద‌ర్శ‌కునిగా ఈ క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జైట్ మెంట్ లో మా టీం ఉంది అన్నారు.

Also Read : వీర‌మ‌ల్లు..అనుకున్న సమయానికి వచ్చేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్