తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లను కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు దేశంలోని 8 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం, బదిలీలు జూలై 8న చేపట్టారు రాష్ట్రపతి కోవింద్.
అయితే మరికొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరగనుందని వార్తలు వెలువడుతున్నాయి, వయసు రీత్యా క్రియాశీలకంగా వ్యవహరించాలేకపోతున్న వారిని మార్చి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ నాడు గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారని వార్తలు కూడా అనధికారికంగా వెలువడుతున్నాయి. దీనితో పురోహిత్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు తో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు కూడా కొత్త గవర్నర్ వస్తారని, కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను తప్పించి సదానంద గౌదని నియమించి, యడ్యూరప్పను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా పంపుతారని ఢిల్లీ లో వార్తలు వినిపిస్తున్నాయి.