ఐపీఎల్ గత రెండు సీజన్లలో పేలవమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23న ఐపీఎల్-2023 సీజన్ వేలం తిరుచ్చిలో జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లనుంచి కొంత మంది ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. హైదరాబాద్ జట్టు యాజమాన్యం కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు ఉద్వాసన పలికింది. మిగిలిన జట్ల విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరులో పెద్దగా మార్పులేమీ లేవు. ఇతర జట్ల నుంచి యాజమాన్యం వదులుకున్నవారు, కొనసాగే వారిలో ముఖ్యమైన ఆటగాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ సన్ రైజర్స్:
- వదులుకున్న ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ప్రియం గార్గ్, రోమానియో షెఫర్డ్
- జట్టులో కొనసాగేది: భువనేశ్వర్ కుమార్, ఏడెన్ మార్ క్రమ్, ఉమ్రాన్ మాలిక్
రాజస్థాన్ రాయల్స్:
- వదులుకున్న ఆటగాళ్ళు: డెరిల్ మిచెల్, నీషమ్ (కివీస్), రస్సీ వాండర్ డస్సెన్ (సౌతాఫ్రికా), నాథన్ కల్టర్ నైల్ (ఆసీస్)
- జట్టులో కొనసాగేది: సంజూ శామ్సన్, జోస్ బట్లర్, యజువేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, యశస్వి జైస్వాల్
ఢిల్లీ కాపిటల్స్:
- జట్టులో కొనసాగేది: రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా
- వదులుకున్న ఆటగాళ్ళు: మన్ దీప్ సింగ్, కెఎస్ భరత్, అశ్విన్ హెబ్బార్, టిమ్ సీఫెర్ట్ (కివీస్ వికెట్ కీపర్)
- శార్దూల్ ఠాకూర్ ను కోల్ కతాకు ఇచ్చి అతని స్థానంలో అమన్ ఖాన్ కు తెచ్చుకుంది
గుజరాత్ టైటాన్స్
- వదులుకున్న ఆటగాళ్ళు: జేసన్ రాయ్, ఫెర్గ్యుసన్, రహమతుల్లా గుర్జాబ్
- జట్టులో కొనసాగేది: హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వాడే, షమీ, రషీద్ ఖాన్,
పంజాబ్ కింగ్స్:
- వదులుకున్న ఆటగాళ్ళు: మయాంక్ అగర్వాల్, ఓడియన్ స్మిత్,
- జట్టులో కొనసాగేది: శిఖర్ ధావన్, బెయిర్ స్టో, భానుక రాజపక్ష, లివింగ్ స్టన్, అర్ష దీప్ సింగ్, రబడ, రాహుల్ చాహర్
ముంబై ఇండియన్స్:
- వదులుకున్న ఆటగాళ్ళు: కీరన్ పోలార్డ్ (బ్యాటింగ్ కోచ్ గా నియామకం); డానియెల్ శామ్స్, జయదేవ్ ఉనాడ్కత్, టైమల్ మిల్స్, మెరెడిత్
- జట్టులో కొనసాగేది: రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్, బుమ్రా, టిం డేవిడ్,
కోల్ కతా నైట్ రైడర్స్ :
- వదులుకున్న ఆటగాళ్ళు: ఆరోన్ పించ్, శివం మావి, పాట్ కమ్మిన్స్, మహమ్మద్ నబి, శామ్ బిల్లింగ్స్, చామిక కరునరత్నే, ఆలెక్స్ హేల్స్
- జట్టులో కొనసాగేది: ఆండ్రీ రస్సెల్, నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, టిం సౌతీ, వరుణ్ చక్రవర్తి, శ్రేయాస్ అయ్యర్
లక్నో సూపర్ జెయింట్స్:
- వదులుకున్న ఆటగాళ్ళు: ఆండ్రూ టై, జేసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్, ఎవిన్ లూయీస్
- జట్టులో కొనసాగేది: కెఎల్ రాహుల్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోనిస్, కేల్ మేయర్స్, దీపక్ హుడా, ఆవేష్ ఖాన్
చెన్నై సూపర్ కింగ్స్:
- వదులుకున్న ఆటగాళ్ళు: డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, రాబిన్ ఊతప్ప
- జట్టులో కొనసాగేది: ధోనీ, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, మహీష్ తీక్షణ, రుతురాజ్ గైక్వాడ్