Thursday, February 27, 2025
Homeస్పోర్ట్స్RSA Vs. WI:  సౌతాఫ్రికా 314/8

RSA Vs. WI:  సౌతాఫ్రికా 314/8

వెస్టిండీస్ తో మొదలైన మొదటి టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్- ఏడెన్ మార్ క్రమ్ లు తొలి వికెట్ కు 141 పరుగులతో గట్టి పునాది వేశారు. ఎల్గర్ 71 పరుగులు చేసి ఔట్ కాగా, మార్ క్రమ్ సెంచరీ తో సత్తా చాటి 115 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చినవారు నిలకడగా ఆడడంలో విఫలపంయ్యారు. కెప్టెన్ బావుమా డకౌట్ కాగా. టోనీ డి జోర్జి-28; క్లాసేన్-20; పీటర్సన్-14; రబడ-8; ముత్తుస్వామి-3 రన్స్ చేసి పెవిలియన్ చేరారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మార్కో జాన్సెన్-17; గెరాల్డ్ కొట్జీ-11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ మూడు వికెట్లతో రాణించగా, రోచ్, కేల్ మేయర్స్, గాబ్రియేల్, జేసన్ హోల్డర్ తలా ఒక వికెట్ సాధించారు.

రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ కోసం విండీస్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది.  సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో నేడు మొదలైన తొలి టెస్టులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్