సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఎడెన్ మార్కరమ్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తూ సన్ రైజర్స్ యాజయాన్యం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31న 16వ సీజన్ ఐపీఎల్-2023 మొదలు కానున్న సంగతి తెలిసిందే. గత సీజన్ కు కేన్ విలియమ్స్, అంతకు ముందు డేవిడ్ వార్నర్ లు జట్టును నడిపించారు.
అయితే గత సీజన్ లో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ నుంచి వైదొలగి ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు. అప్పుడు విలియమ్సన్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ 2023 సీజన్ కు కేన్ ను గుజరాత్ టైటాన్స్ వేలంలో చేజిక్కించుకుంది. కొత్త కెప్టెన్ ఎంపికపై కొంత కాలంగా మల్ల గుల్లలు పడుతోన్న సన్ రైజర్స్ చివరకు మార్కరమ్ ను ఎంపిక చేసింది.
సౌతాఫ్రికా లో జరుగుతోన్న టి20 లీగ్ ‘SA-20’ లో సన్ రైజర్స్ భాగస్వామ్య కంపెనీ ‘సన్ రైజర్స్ ఈస్ట్రన్ కంపెనీ’ పేరుతో ఓ ఫ్రాంచైజీ ని నిర్వహిస్తోంది. దానికి మార్కరమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 12న ముగిసిన ఆ టోర్నీ ఫైనల్ లో ఈ టీమ్ విజేతగా నిలిచింది. అందుకే సొంత దేశంలోని టీమ్ కు కూడా మార్కరమ్ ను సారధిగా ఎంపిక చేశారు.
సన్ రైజర్స్ 2016లో ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా, 2018లో రన్నరప్ గా నిలిచింది.