Saturday, June 13, 2026
Homeసినిమా'కాంతార' సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తో అజయ్ భూపతి

‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తో అజయ్ భూపతి

‘ఆర్ఎక్స్ 100’ తో అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. రెండో సినిమాగా ‘మహా సముద్రం’ అనే సినిమా చేశాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు అజయ్ భూపతి తన సొంత బ్యానర్ ‘ఎ క్రియేటివ్ వర్క్స్’ మరియు ‘ముద్ర మీడియా వర్క్స్’ పతాకాల పై న్యూ జానర్ కథతో తన మూడవ చిత్రం చేయనున్నారు.’విక్రాంత్ రోనా’, ‘కాంతార’ వంటి చిత్రాలకి సెన్సేషనల్ ఆల్బమ్ అందించిన ‘అజనీష్ లోకనాథ్’ ఒక వైపు డివైన్ ఆల్బమ్స్ ఇస్తూనే.. మాస్ పాటలతో ఉర్రూతలూగించారు.

ఎలాంటి కథలో అయినా తన నేపథ్య సంగీతం, పాటలతో మరో స్థాయికి తీసుకెళ్లే అజనీష్ లోకనాథ్ అజయ్ భూపతి మూడవ చిత్రానికి సంగీతం అందించనున్నారు. సరికొత్త కథ కథనాలతో తెరకెక్కనున్న ఈ చిత్ర టైటిల్ ని ఇతర నటీనటుల వివరాలని త్వరలో వెల్లడించనున్నట్లు తెలియచేశారు దర్శకుడు అజయ్ భూపతి. అజనీష్ లాంటి ప్రతిభ గల సంగీత దర్శకుడితో తన సొంత బ్యానర్ లో చేయనున్న మొదటి చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరి.. అజయ్ భూపతి మూడవ చిత్రంతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular