Tuesday, June 9, 2026
Homeసినిమావచ్చే ఏడాది జూన్ 3న రానున్నఅజయ్ దేవగణ్ మైదాన్

వచ్చే ఏడాది జూన్ 3న రానున్నఅజయ్ దేవగణ్ మైదాన్

ప్రపంచంలో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్). ఈ ఆట నేపథ్యంలో యదార్ధగాథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. ప్రపంచపటంలో ఫుట్ బాల్ ఆటకు సంబంధించి భారత దేశానికి కూడా ఓ ప్రాముఖ్యత ఆపాదించిన ఓ కోచ్ నిజ జీవిత కథతో ఈ చిత్రం తెరెకెక్కుతుంది. జీవితంలోనైనా, ఆటలోనైనా ఆత్మవిశ్వాసం, కష్టపడేతత్వంతో పాటు ఎన్నో త్యాగాలుచేస్తే గాని విజయం వరిస్తుంది. స్ఫూర్తివంతమైన కథగా  మైదాన్ నిర్మించబడింది.

ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్, గత ఏడాది రెండు సార్లు విడుదల తేదీ ని కూడా ప్రకటించారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా ఆయా తేదీలలో విడుదల చేయలేదు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం 2022, జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ…”రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్నాం. ఎవరికి వారు ఇంటిపట్టునే వుండి  తమ ప్రాణాలను సురక్షితంగా కాపాడుకున్నారు. అలాంటి పరిస్థితులలో థియేటర్లలన్నీ మూత పడ్డాయి. మన భారత దేశం గర్వపడేలా రూపొందించిన మా ‘మైదాన్’ థియేటర్లలో చూస్తేనే థ్రిల్ గా ఉంటుందని, రెండుసార్లు ప్రకటించిన తేదీల్లో విడుదల చేయలేకపోయాము. వచ్చేఏడాది జూన్ 3వ తేదీన పక్కా ప్రణాళికతో విడుదల తేదీని ఖరారు చేశాము” అన్నారు.

బాదాయ్ హో వంటి సక్సెస్ ఫుల్  చిత్రాన్ని అందించిన దర్శకుడు రవీంద్ర నాథ్ శర్మ మాట్లాడుతూ ” గతంలో కబడ్డీ, క్రికెట్, బాక్సింగ్, రెజ్లింగ్, రన్నింగ్ రేస్ వంటి గేమ్స్ నేపధ్యం లో ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ ఫుట్ బాల్ పై ఇండియన్ మూవీ ఇప్పటివరకు నిర్మించలేదు. చిత్రం చూస్తున్నంతసేపు ఫుట్ బాల్ స్టేడియంలో మనం వున్నట్లుగా ఆటగాడితో పాటు ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ఉంటాయి.  అందుకనే ఇన్నాళ్లు థియేటర్లో మాత్రమే రిలీజ్ చేయాలని ఎదురు చూసి విడుదల తేదీని ప్రకటించాం” అన్నారు.

అజయ్ దేవగణ్ తో పాటు నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి,  ‘బాదాయ్ హో’ ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్, నితన్ష్ గోయల్, తది తరులు నటిస్తున్న మైదాన్ చిత్రాన్ని ఫ్రెష్ లైం ఫిలిమ్స్ సహకారంతో జీ స్టూడియోస్ బ్యానర్ పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా,  అరుణవ జాయ్ సేన్ గుప్తా  నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular