Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్WTC Final - India Squad: అజింక్యా రెహానేకు చోటు

WTC Final – India Squad: అజింక్యా రెహానేకు చోటు

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ 2021-23కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది.  ఈ సీజన్ ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తోన్న అజింక్యా రెహానేకు జట్టులో చోటు దక్కింది.  ఇటీవల ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకున్న తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ కు కూడా అవకాశం లభించింది.

గాయాల కారణంగా జస్ ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ లను పరిగణన లోకి తీసుకోలేదు. ఇషాన్ కిషన్ తో పాటు కొంతకాలంగా విఫలమవుతోన్న సూర్య కుమార్ యాదవ్ ను కూడా పక్కన పెట్టారు.

జట్టు వివరాలు:
రోహిత్ శర్మ (కెప్టెన్); శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రెహానే, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్, జయ్ దేవ్ ఉనాద్కత్

 ప్రతి రెండేళ్ళ సీజన్ కు టెస్ట్ క్రికెట్ లో టాప్ రెండు జట్ల మధ్య టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్ణయించింది. 2019-21 తొలి సీజన్ లో న్యూ జిలాండ్- ఇండియా ఫైనల్స్ కు చేరుకోగా కివీస్ విజేతగా నిలిచింది. 2021-23 సీజన్ కు ఆస్ట్రేలియా- ఇండియా జట్లు ఫైనల్స్ కు అర్హత పొందాయి.

జూన్ 7 నుంచి 11 వరకూ లండన్ లోని ది ఓవల్ మైదానంలో ఫైనల్స్ జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్