Monday, March 16, 2026
Homeస్పోర్ట్స్IPL: Rahane Super Innings: కోల్ కతాపై చెన్నైవిజయం

IPL: Rahane Super Innings: కోల్ కతాపై చెన్నైవిజయం

చెన్నై సూపర్ కింగ్స్ జూలు విదిల్చింది. నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై235 పరుగుల భారీ స్కోరు చేసింది, ఈ సీజన్ లో ఇదే హయ్యస్ట్ స్కోరు. లక్ష్యసాధనలో కోల్ కతా 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది.

 ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై తొలి వికెట్ కు 73 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 20 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ సమయానికి 13 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నఅజింక్యా రేహానే తర్వాత వచ్చిన శివమ్ దూబేలు కోల్ కతా బౌలర్లపై ప్రతాపం చూపి ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి 85 పరుగులు జోడించారు. శివమ్ దూబే 21 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 50 రన్స్ సాధించి ఔటయ్యాడు. జడేజా 8 బంతుల్లో 2 సిక్సర్లతో 18 స్కోరు చేసి వెనుదిరిగాడు. రేహానే కేవలం 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.

కోల్ కతా బౌలర్లలో కుల్వంత్ కేజ్రోలియా 2; వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య సాధనలో కోల్ కతా  ఒక్క పరుగు వద్ద ఓపెనర్ల ఇద్దరి వికెట్లూ (జగదీషన్-1; సునీల్ నరిన్ డకౌట్) కోల్పోయింది. వెంకటేష్ అయ్యర్-20; కెప్టెన్ నితీష్ రాణా-27 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో జేసన్ రాయ్, రింకూ సింగ్ తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడి 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత రింకూ సింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆండ్రీ రస్సెల్ (9); డేవిడ్ వీస్ (1) విఫలమయ్యారు. రింకూ సింగ్ 33 బంతుల్లో 3 ఫోర్లు,4  సిక్సర్లతో 53 పరుగులతో అజేయంగా నిలిచాడు.

చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహీశ తీక్షణ చెరో 2; ఆకాష్ సింగ్, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మతీష ప్రతిరణలకు తలా ఒక వికెట్ దక్కింది.

అజింక్యా రెహానే కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular