Sunday, January 19, 2025
Homeసినిమాజనవరి 13న అజిత్ ‘వాలిమై’ గ్రాండ్ రిలీజ్

జనవరి 13న అజిత్ ‘వాలిమై’ గ్రాండ్ రిలీజ్

Valimai for Sankranthi: అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకం పై బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన తమిళ ట్రైలర్ 20 మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా జనవరి 13న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ… గత ఏడాది కోవిడ్ 19 కారణంగా షూటింగ్ కి గ్యాప్ వచ్చినా ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా పూర్తి చేసి జనవరి 13న ముందుగా తమిళ్ వెర్షన్ విడుదల చేద్దామని అనుకున్నాం. అయితే… తమిళ్ వెర్షన్ మాత్రమే అనుకున్నాం కానీ తెలుగునాట సంక్రాంతి పండగకు కి ప్రాముఖ్యత ఎలాంటిదో గుర్తించి ఇదే సరైన సమయమని తమిళ్ తో పాటు హిందీ, తెలుగు కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం.

తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు. హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా, ఆయన తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకున్నారు. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్యంతం ఆస‌క్తిగా ఉంటుంది అన్నారు.

Also Read : సరికొత్త రికార్డు సాధించిన అజిత్ ‘వాలిమై’ ట్రైలర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్