Sunday, January 19, 2025
Homeసినిమాఆకాష్ పూరి క్లాప్ తో ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ చిత్రం

ఆకాష్ పూరి క్లాప్ తో ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ చిత్రం

మహీంద్ర పిక్చర్స్ పతాకం పై చైతన్య పసుపులేటి , రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపంలో జరిగాయి.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరో ఆకాష్ పూరి హాజరై హీరో హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ “ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నందున ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుకొని హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసుకొంటా”మని అన్నారు.

చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా వెంకటేష్ గారు నా మెదటి సినిమా నుండి తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.మంచి టీం, మంచి కథతో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్