Thursday, April 25, 2024
Homeసినిమా‘మధురపూడి గ్రామం అనే నేను’ సాంగ్ విడుద‌ల‌ చేసిన ఆకాష్

‘మధురపూడి గ్రామం అనే నేను’ సాంగ్ విడుద‌ల‌ చేసిన ఆకాష్

Madhurapudi: శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా హీరో ఆకాష్ పూరీ ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘వెల్లే గోరిక’ ను విడుదల చేశారు. అనంతరం పాట బాగుందంటూ హీరో శివ కంఠమనేని, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా..ధనుంజయ్, సాహితీ పాడారు. ‘వెల్లే గోరింక మళ్లి రావే నా వంకనన్నే నేను మరిసిపోయా నిన్నే చూశాకచాల్లే చాలింక ఈ అల్లరి ఎందాకా ..పోతా ఉంటే రారా అంటూ గోలే చేయమాకపట్టుకో పోనీక కట్టుకో కొంగెనక..రైకలో దాచేయవే గుండెనే పారేయక..’ అంటూ రొమాంటిక్ గా సాగుతుందీ పాట. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్