Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్య‌ అఖండ మూడో రోజు క‌లెక్ష‌న్స్

బాల‌య్య‌ అఖండ మూడో రోజు క‌లెక్ష‌న్స్

Akhanda – roaring
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అఖండ‌. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌, బోయ‌పాటి క‌లిసి చేసిన‌ సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డం ఖాయం.. ఈ కాంబినేష‌న్ హ్యాట్రిక్ సాధించ‌డం ఖాయం అనుకున్నారు. అనుకున్న‌ట్టుగానే.. అఖండ అద్భుత‌మైన విజ‌యం సాధించింది.

సరికొత్త రికార్డులు సాధిస్తూ దూసుకెళుతుంది. మొద‌టి రోజు, రెండో రోజు రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన అఖండ మూడో రోజు కూడా అదే స్పీడు కంటిన్యూ చేసింది.  ఇక అఖండ మూడు రోజుల క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. నైజాం 2.51 కోట్లు, సీడెడ్ 1.78 కోట్లు, యు.ఏ 82 ల‌క్ష‌లు, ఈస్ట్ 53 ల‌క్స‌లు, వెస్ట్ 32 ల‌క్ష‌లు, గుంటూరు 43 ల‌క్ష‌లు, కృష్ణ 41 ల‌క్ష‌లు, నెల్లూరు 23 ల‌క్ష‌లు మొత్తంగా ఆంధ్రా, తెలంగాణ‌లో క‌లిపి మూడో రోజు 7.03 కోట్లు షేర్, 11.20 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇక ఓవ‌ర్ సీస్ లో అయితే.. $700 కె క‌లెక్ట్ చేసి 1 మిలియ‌న్ దిశ‌గా దూసుకెళుతుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్