Sindhu lost:

వరల్డ్ టూర్ ఫైనల్స్-2021 లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు రన్నరప్ గా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి అన్ సియేంగ్ 21-16; 21-12 తేడాతో సింధుపై విజయం సాధించింది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 2016 లో సెమీస్, 2017 లో ఫైనల్స్ కు చేరుకున్న సింధు 2018లో టైటిల్ గెల్చుకుంది. అయితే ఆ తర్వాత 2019, 2020 సంవత్సరాల్లో గ్రూప్ దశను దాటలేకపోయింది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెల్చుకున్న సింధు  కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శనతో రాణిస్తోంది.  ఈ టోర్నీ లీగ్ దశల్లో మూడు మ్యాచ్ లలో రెండిటిలో గెల్చిన సింధు నిన్న జరిగిన సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి అనేకా యమగుచిపై 21-15, 15-21; 21-19 తేడాతో నెగ్గి ఫైనల్స్ లో అడుగుపెట్టింది.

నేడు జరిగిన ఫైనల్స్ లో మొదటి నుంచీ సియేంగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్ మధ్యలో సింధు కాస్త పుంజుకున్నట్లు కనిపించినా సియేంగ్ మళ్ళీ తేరుకొని సెట్ చేజిక్కించుకుంది. రెండో సెట్ లో కూడా సింధు సిఎంగ్ ను ఏమాత్రం నిలువరించలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *