Friday, March 29, 2024
Homeసినిమాఅఖిల్ ఏజెంట్ ఆగిందా.?

అఖిల్ ఏజెంట్ ఆగిందా.?

Agent Stalled? అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని అనిల్ సుంక‌ర, సురేంద‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని 2021 డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. క‌రోనా కార‌ణంగా షూటింగ్ కి బ్రేక్ రావ‌డంతో రిలీజ్ వాయిదా ప‌డింది.

ఆ త‌ర్వాత 2022లో ఆగ‌ష్టు 12 న ఏజెంట్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే.. ఇప్పుడు ఆగ‌ష్టు 12న ఏజెంట్ రావ‌డం లేద‌ని.. మ‌రోసారి వాయిదా ప‌డింద‌ని గ‌త కొన్ని రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమా బ‌డ్జెట్ 50 కోట్లు అనుకుంటే.. అది ఇప్పుడు 70 కోట్లు అయ్యింద‌ట‌. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అందుచేత ప్ర‌స్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఆగింద‌ని టాక్ వినిపిస్తోంది.

అయితే.. బ‌డ్జెట్ ఎక్కువ అవ్వ‌డం వ‌ల‌న షూటింగ్ ఆగింద‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమాని సాధ్యమైనంత త్వ‌ర‌గా కంప్లీట్ చేసి సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఏజెంట్ న్యూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్