Sunday, March 8, 2026
Homeసినిమాఅఖిల్ తో ‘మైత్రీ’ మూవీ?

అఖిల్ తో ‘మైత్రీ’ మూవీ?

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. గత సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా ఆగింది. ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఆగష్టు లేదా సెప్టెంబర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ విడుదల పై క్లారిటీ వస్తుంది.

ఈ సినిమా తర్వాత స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నారు. ఈ మూవీ టైటిల్ ‘ఏజెంట్’, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అఖిల్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. వరుసగా భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ సంస్థ అఖిల్ తో ఓ విభిన్న ప్రేమకథా చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఎవరు అనేది తెలియలేదు కానీ… ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి పేరు వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular