Saturday, January 18, 2025
Homeసినిమాఅఖిల్.. సల్మాన్ ని ఫాలో కానున్నాడా?

అఖిల్.. సల్మాన్ ని ఫాలో కానున్నాడా?

కరోనా రావడం థియేటర్లు మూతపడడంతో.. ఓటీటీకి టైమ్ వచ్చింది. చిన్న సినిమాలు, మిడియం సినిమాలు ఓటీటీ వైపు చూస్తే.. కొన్ని ఓటీటీ సంస్థలు మాత్రం భారీ చిత్రాల వైపు చూశాయి. అయితే.. స్టార్ హీరోలు, బడా ప్రొడ్యూసర్స్ మాత్రం భారీ చిత్రాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. కారణం ఏంటంటే.. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తే.. భారీ చిత్రాలు బ్రేక్ ఈవన్ కావడం చాలా కష్టం. అందుకే భారీ చిత్రాలు ఓటీటీ వైపు చూడలేదు. అయితే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం రాధే చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటీలోను, థియేటర్ లోను ఒకేసారి రిలీజ్ చేశారు.

సినిమా ఎలా ఉన్నా..ఓటీటీలో ఈ సినిమాకి మాత్రం ఆదరణ బాగా లభించింది. దీంతో ఇప్పుడు అఖిల్ మూవీ కూడా ఇలా ఒకేసారి ఓటీటీలో, ధియేటర్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందట. ఇంతకీ ఏ సినిమా అంటే.. అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఏజెంట్ మూవీ. ఇలా చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే.. దీనికి బడ్జెట్ ఎక్కువ. అఖిల్ మార్కెట్ కి మించిన బడ్జెట్ అవుతుంది. అందుకనే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థని పార్ట్ నర్ గా చేసుకుని ఒప్పందం చేసుకోవాలి అనుకుంటున్నారని తెలిసింది.

ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కానీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జులై లేదా ఆగష్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్