Saturday, March 14, 2026
Homeసినిమాఅఖిల్ తో చరణ్ మూవీ లేదా..?

అఖిల్ తో చరణ్ మూవీ లేదా..?

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. త్వరలోనే అనౌన్స్ మెంట్ అంటూ ప్రచారం మొదలైంది. కొత్త దర్శకుడు అనిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే.. ఇటీవల చరణ్‌ వి మెగా పిక్చర్ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాడు. తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి చరణ్‌ ఈ బ్యానర్ ప్రారంభించాడు. ఇందులో చరణ్ ఫస్ట్ మూవీని అఖిల్ తో నిర్మిస్తాడని ప్రచారం జరిగింది. కానీ.. నిఖిల్ తో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

నిఖిల్ తో సినిమాని అనౌన్స్ చేసినప్పటికీ అఖిల్ తో సినిమా ఉంటుందని.. త్వరలోనే అఖిల్ మూవీని కూడా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. తాజా వార్త ఏంటంటే.. అఖిల్ తో చరణ్ మూవీ లేదట. అఖిల్ నెక్ట్స్ మూవీని యువీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని యువీ సంస్థ సోలోగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ ఖరారు చేశారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు.

ఇది సోసియో ఫాంటసీ మూవీ అని బడ్జెట్ దాదాపు 40 నుంచి 50 వరకు అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది ఫైనల్ చేస్తున్నారని తెలిసింది. అఖిల్ ఏజెంట్ సినిమాతో నిరాశపరచడంతో ఈ సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. నాగార్జున కూడా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈసారి మిస్ కాకుండా బ్లాక్ బస్టర్ సాధించాలని టీమ్ అంతా కసితో వర్క్ చేస్తున్నారు. మరి.. ఈసారైనా అఖిల్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular