Monday, May 20, 2024
Homeసినిమా'దేవర' మళ్లీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

‘దేవర’ మళ్లీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దేవర పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో దేవర షూటింగ్ జరిగింది. ఇందులో ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ కి గ్యాప్ రావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఈ వీడియోలు బయటకు రావడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది.

అయితే.. దేవర తాజా షెడ్యూల్ ఎప్పుడు..? అప్ డేట్ ఏంటి అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ కోసం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ ను కూడా వేశారని తెలిసింది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేయనుంది. అలాగే మరో భామ కూడా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. ఎవరా సెకండ్ హీరోయిన్ అనేది బయటకు రాలేదు. షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఈ చిత్రాన్నివచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా ఈ సినిమా ఉంటుందని టీమ్ గట్టి నమ్మకంతో చెబుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్