Sunday, January 19, 2025
HomeసినిమాAkkineni Akhil: అఖిల్ కు గ్యాప్ వచ్చిందా? ఇచ్చాడా?

Akkineni Akhil: అఖిల్ కు గ్యాప్ వచ్చిందా? ఇచ్చాడా?

అక్కినేని అఖల్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. తొలి సినిమాతో సంచలనం సృష్టిస్తాడనుకుంటే.. ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆతర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా అంతే. ఆఖరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో తొలి విజయం అందుకున్నాడు. ఆతర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ఏజెంట్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. కథ లేకుండా ఈ సినిమాను తీశామని నిర్మాత అనిల్ సుంకర అసలు విషయం బయటపెట్టి అభిమానులకు సారీ కూడా చెప్పారు.

ఏజెంట్ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను  అఖిల్ ప్రకటించలేదు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో  సినిమా ఉంటుందని వార్తలొచ్చినా  క్లారిటీ లేదు. దీంతో అఖిల్ కు గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఇచ్చాడా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రతిసారీ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనుకోవడం.. ఆతర్వాత అనుకోకుండా గ్యాప్ రావడం జరుగుతోంది, అయితే రెండు సినిమాలను ఓకేసారి చేసేలా ప్లాన్ చేస్తున్నాడని తాజా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఓకే చేసిన రెండు సినిమాల కథల పై కసరత్తు చేస్తున్నారట. జనవరిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతారని అంటున్నారు. ఈసారి సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడట. బడ్జెట్ భారీగానే అవుతుందట. అందుచేత ఎలా బడ్జెట్ తగ్గించాలి.. ఎలా ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు చేయబోయే సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. ఈసారి అఖిల్ ఏం చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్