7.5 C
New York
Friday, December 1, 2023

Buy now

HomeసినిమాLEO: అంచనాలు పెంచుతున్న 'లియో'  

LEO: అంచనాలు పెంచుతున్న ‘లియో’  

విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన సినిమాల రికార్డులను అధిగమించడం ఆయన వల్లనే అవుతుందని అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటి విజయ్ టాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టడం చాలా ఆలస్యమైందనే చెప్పాలి. రజనీ .. కమల్, ఆ తరువాత విక్రమ్ .. సూర్య .. కార్తి లాంటివారు ఇక్కడ బలమైన మార్కెట్ ను సంపాదించుకున్నారు. కాస్త ఆలస్యంగా విజయ్ ఇటువైపు దృష్టి పెట్టాడు. అందువల్లనే ఇక్కడ విజయ్ సినిమాలను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి కొంత సమయం పట్టింది.

‘మాస్టర్’ .. ‘బీస్ట్’ .. ‘వారసుడు’ వంటి సినిమాల నుంచి ఇక్కడ విజయ్ సినిమాల గ్రాఫ్ పెరిగింది. కోలీవుడ్ లో విజయ్ చాలా పెద్ద స్టార్ అనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఆయన ఇక్కడి ప్రేక్షకులకు చేరువ కావడం దిశగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోవడం వలన, ఆ గ్యాప్ అలా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు చాలావరకూ ఆ పరిస్థితి లేదు. మాస్ ఆడియన్స్ విజయ్ సినిమాలను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ కూడా తన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వెళ్లేలా చూసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే విజయ్ చేసిన ‘లియో’ ఈ నెల19వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతోంది. ‘ఖైదీ’ .. ‘మాస్టర్’ .. ‘విక్రమ్’ సినిమాల తరువాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా ఇక్కడి ప్రేక్షకులకు తెలిసిపోయాడు. ఆయన నుంచి ఏ స్థాయి సినిమాలు వస్తాయనే విషయంలో ఒక నమ్మకం ఏర్పడిపోయింది. అందువలన ‘లియో’ సినిమాపై అంచనాలు పెరగడానికి ఆయన కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అనిరుధ్ సంగీతం మరో కారణంగా భావించవచ్చు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా, ఆ స్థాయి వసూళ్లను రాబడుతుందనే అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్