Friday, March 28, 2025
HomeTrending Newsమరదలికి బావ శుభాకాంక్షలు

మరదలికి బావ శుభాకాంక్షలు

Akhilesh response: బిజెపిలో చేరిన ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్ కు ఆమె బావ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అపర్ణా నేటి ఉదయం ఢిల్లీ లో బిజెపి పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వ్యాఖ్యానించాలని అఖిలేష్ ను మీడియా కోరగా అయన పై విధంగా స్పందించారు.  సమాజ్ వాదీ పార్టీ భావజాలం వ్యాప్తి చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు అఖిలేష్. తమ పార్టీ భావజాలం ప్రకారం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆమె కృషిచేస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. అపర్ణా యాదవ్ ను పార్టీ మారకుండా చూసేందుకు ములాయం కృషి చేశారని కానీ ఆమె ఆక్కడకు వెళ్లేందుకు అప్పటికే నిర్ణయం తీసుకున్నారని అఖిలేష్ వివరించారు.

తాము టిక్కెట్లు ఇవ్వలేని వారికి బిజెపి ఇస్తున్నదుకు సంతోషంగా ఉందని అంటూ బిజెపికి కూడా కూడా థాంక్స్ చెప్పారు అఖిలేష్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్