Tuesday, June 16, 2026
HomeసినిమాNC23: మత్స్యకారుల కుటుంబాలను కలిసిన నాగ చైతన్య

NC23: మత్స్యకారుల కుటుంబాలను కలిసిన నాగ చైతన్య

నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశారు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నారు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగచైతన్య. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ‘#NC23’ అనే టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.  అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై బన్నీ వాస్ నిర్మించనున్నారు.

#NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ నెలలో షూట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్  వైజాగ్‌ వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల కుటుంబాలను కలిశారు.

ఈ సందర్భంగా మీడియాతో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ”ఆరు నెలల క్రితం చందూ కథను చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. యదార్థ సంఘటనల ఆధారంగా కథను డెవలప్ చేశారు. వాస్, చందూ రెండేళ్లుగా కథ పై వర్క్ చేస్తున్నారు. కథ చాలా ఇన్‌స్పైరింగ్ గా ఉంది. మత్స్యకారుల జీవనశైలిని తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాం. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ రోజు మొదలౌతున్నాయి’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular