Tuesday, June 16, 2026
Homeసినిమాఎట్టకేలకు నాగ్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

ఎట్టకేలకు నాగ్ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ మూవీ రిలీజై ఎనిమిది నెలలు అవుతుంది కానీ.. ఇంత వరకు నాగ్ కొత్త సినిమా ఎప్పుడు..? ఎవరితో..? అనేది ప్రకటించలేదు. రైటర్ బెజవాడ ప్రసన్నతో నాగార్జున సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. రైటర్ బెజవాడ ప్రసన్నకు బడ్జెట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇటీవల మీడియాకు ముందుకు వచ్చిన నాగార్జునను కొత్త సినిమా ఎప్పుడు అని అడిగితే.. తొందర ఏముంది..? చేద్దామన్నారు. దీంతో ఇప్పట్లో నాగ్ మూవీ లేదని జోరుగా వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతితో నాగార్జున మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని తెలిసింది. ఈ చిత్రాన్ని  నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం అజయ్ భూపతి.. మంగళవారం అనే సినిమా చేస్తున్నాడు. ఇది షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఆ వెంటనే నాగ్ తో మూవీని సెట్స్ పైకి తీసుకురావాలి అనేది ప్లాన్. ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడంతో అటు ఆడియన్స్ లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ అజయ్ భూపతి సినిమాలపై ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తాడనే పేరు వచ్చింది. ఇప్పుడు నాగ్ తో మూవీ అంటే మరింతగా అంచనాలు ఉంటాయి. మరి.. నాగ్ అభిమానులు ఆశించినట్టుగా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular