Wednesday, June 17, 2026
HomeసినిమాPushpa: 'పుష్ప 2' లో నటించే బాలీవుడ్ స్టార్?

Pushpa: ‘పుష్ప 2’ లో నటించే బాలీవుడ్ స్టార్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లో  రూపొందుతోన్న పుష్ప 2  ప్రస్తుతం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఇంట్రో సాంగ్ పూర్తి చేసిన సుకుమార్.. హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమాలో ఓ సాలిడ్ క్యామియో రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అతనితో చిత్రయూనిట్ చర్చలు జరిపిందని.. అక్షయ్ సైతం పుష్ప 2లో భాగమయ్యేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే  బాలీవుడ్ లో మరోసారి పుష్పరాజ్ మేనియా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 1000 కోట్ల టార్గెట్ గా పుష్ప 2 రెడీ అవుతుందని.. బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 సంచలనం సృష్టించడం ఖాయమని టీమ్ అంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. బన్నీ, సుక్కు కలిసి మరోసారి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.

Also Read : Pushpa 2: ‘పుష్ప ఎక్కడ?’ సుక్కు సూపర్ ప్లాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular