Saturday, January 18, 2025
HomeTrending Newsసోమాలియాలో పట్టుబిగిస్తున్న అల్ షబాబ్ టెర్రరిస్టులు

సోమాలియాలో పట్టుబిగిస్తున్న అల్ షబాబ్ టెర్రరిస్టులు

సోమాలియాలో ఉగ్రదాడి జరిగింది. రాజధాని మొగదిషులోని హయత్ హోటల్‌పై అల్ షబాబ్  టెర్రరిస్ట్ గ్రూప్ దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌లోని రెండు చోట్ల కార్లలో బాంబులు పెట్టి ఉగ్రవాదులు పేల్చారు. చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ముందుగా హయత్ హోటల్ భవనం స్లాబ్ పై సొరంగాలు చేసి భవనంలోకి దుకారని.. ఆ వెనువెంటనే కాల్పులకు దిగిన ఉగ్రముకలు హోటల్ లో భయోత్పాతం సృష్టించాయి. మోగాదిషు నగరంలోని హయత్ హోటల్ లో ఎక్కువగా ప్రభుత్వ అధికారులు వివిధ సమావేశాలలో పాల్గొంటారు. అంతర్జాతీయ సంస్థలతో సమావేశాలు ఎక్కువగా హయత్ హోటల్ లోనే జరుగుతుంటాయి.

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేసే అల్ షబాబ్ సోమాలియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం కొన్నేళ్లుగా తీవ్ర స్థాయిలో విధ్వంసానికి పాల్పడుతోంది. దక్షిణ, మధ్య సోమాలియాలో పూర్తి స్థాయి పట్టు కలిగిన అల్ షబాబ్ టెర్రరిస్ట్ గ్రూప్ కొద్దిరోజులుగా దాడులు ముమ్మరం చేసింది. కొంతకాలంగా సోమాలియ – ఇథియోపియా సరిహద్దు ప్రాంతాలపై దాడులు ముమ్మరం చేసింది. అల్ షబాబ్ సంస్థ తన పట్టు నిరూపించుకునేందుకే రాజధాని మోగాదిషుపై దాడికి దిగిందని విశ్లేషకులు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్