Friday, March 20, 2026
Homeసినిమామళ్ళీ ‘అల...’ కాంబినేషన్!

మళ్ళీ ‘అల…’ కాంబినేషన్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘అల.. వైకుంఠపురములో’.  ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ సంచలన చిత్రం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్లో మూవీ నిర్మించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు ఆ వార్తలను నిజం చేసేలా ట్వీట్ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇంతకీ మేటర్ ఏంటంటే..  అల్లు అర్జున్, త్రివిక్రమ్, తమన్ లతో ఉన్న ఫోటోను నిర్మాత సూర్యదేవర నాగవంశీ షేర్ చేసి ఒక సర్ ఫ్రైజ్ అనౌన్స్ మెంట్ త్వరలో అందించనున్నట్టుగా తెలియచేశారు. దీనిని బట్టి ‘అల.. వైకుంఠపురములో’ కాంబినేషన్ రిపీట్  అవ్వబోతుందని తెలుస్తోంది.  ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు  అనౌన్స్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular