Friday, April 19, 2024
HomeTrending Newsమహారాష్ట్ర హోం మంత్రికి కరోనా

మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, గత కొద్ది రోజులుగా కేసులు భారీగా తగ్గుతూ, పెరుగుతూ 20 వేల దిగువనే ఊగిసలాడుతున్నాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. బుధవారం 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 16,156 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే దాదాపు 3 వేల కేసులు అదనంగా వెలుగుచూశాయి. కొద్ది రోజులుగా కేరళ ప్రభుత్వం మృతుల సంఖ్యను సవరిస్తోంది. ఫలితంగా మరణాల సంఖ్య పెరిగింది. నిన్న ఆరోగ్యశాఖ 733 (కేరళలో 622) మరణాలను రికార్డు చేసింది. ఇప్పటి వరకు 3.42 కోట్ల మందికి వైరస్ సోకగా.. 4,56,386 మంది చనిపోయారు.

98.20 శాతానికి చేరిన రికవరీ రేటు
ఇటీవల వైరస్ వ్యాప్తి మందగించింది. ఫలితంగా రికవరీ రేటు, క్రియాశీల రేటు మెరుగవుతున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.20 శాతానికి చేరగా, క్రియాశీల కేసుల రేటు 0.47 శాతానికి తగ్గింది. నిన్న 17,095 మంది కోలుకోగా.. మొత్తంగా 3.36 కోట్ల మంది కరోనాను జయించారు. ప్రస్తుతం 1,60,989 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక నిన్న 49,09,254 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 104 కోట్ల మైలురాయిని దాటింది.

మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా
మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోగా.. వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్