Thursday, April 10, 2025
Homeస్పోర్ట్స్Carey Century: ఆస్ట్రేలియా 575/8 డిక్లేర్డ్

Carey Century: ఆస్ట్రేలియా 575/8 డిక్లేర్డ్

సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. మూడు వికెట్లు 386 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఆసీస్  జట్టులో అలెక్స్ కారీ సెంచరీ సాధించాడు. నిన్న డబుల్ సెంచరీ చేసి గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళిన డేవిడ్ వార్నర్ నేడు బరిలోకి దిగి అదే స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ చెరో 51 పరుగులు సాధించారు. ఎనిమిది వికెట్లకు 575 స్కోరు వద్ద  కెప్టెన్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు.  తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 386 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

రెండు రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా ఏడు ఒవర్లపాటు ఆడి ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ డకౌట్ అయ్యాడు. సరేల్ ఎర్వీ-7; డే బ్రుఎన్-6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్