Sunday, April 20, 2025
Homeసినిమాఆలియా భ‌ట్ గంగుబాయి క‌థియావాటి ట్రైల‌ర్ విడుద‌ల‌

ఆలియా భ‌ట్ గంగుబాయి క‌థియావాటి ట్రైల‌ర్ విడుద‌ల‌

Gangubai Trailer : బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భ‌న్సాలీ తన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ వీక్షకుల‌ను త‌న‌ విజువల్స్‌లో అనుభూతి చెందేలా చేస్తుంటారు. తాజాగా ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో అయన రూపొందిన చిత్రం గంగూబాయి కథియావాడి. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. 1960 ద‌శ‌కంలోని కథ ఇది.

ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆలియా భట్‌ అవమానాన్ని అహంకారంగా మార్చుకుంది. రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటోంది. వేశ్య‌లు, వారి కుటుంబాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చైతన్యంతో నిండి ఉంది. గంగూబాయి పాత్రలో ఆలియా భట్ చాలా చ‌క్క‌గా న‌టించింది. ఇక అజయ్ దేవగన్ గంగూబాయి ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మాఫియా డాన్ కరీం లాలాగా క‌నిపించాడు. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

భ‌న్సాలీ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. గంగూబాయి కథియావాడి సినిమా 25 ఫిబ్రవరి, 2022న విడుదల కానుంది.

Also Read : ఫిబ్రవరి 25న అలియా భట్ ‘గంగూబాయి కథియావాడి’

RELATED ARTICLES

Most Popular

న్యూస్