Thursday, June 11, 2026
Homeసినిమామీ అందరి ఆశీస్సుల వల్లే బ్రతికాను : డాక్టర్ రాజశేఖర్

మీ అందరి ఆశీస్సుల వల్లే బ్రతికాను : డాక్టర్ రాజశేఖర్

Your Blessings: ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు రాజశేఖర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే కార్యక్రమంలో తను నటించిన 91 వ సినిమా ‘శేఖర్’ లోని ‘కిన్నెర’ సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాల పై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన
ఓ..సన్నజాజి తీగలా.. అల్లుకోవే నన్నిలా కిన్నెరా.. ఓ..కిన్నెరా..
సంకురాత్రి పంటలా.. పంచుకోవే నన్నిలా..కిన్నెరా.. ఓ..కిన్నెరా..
అనే పాట వినసొంపుగా ఉంది.

Sekhar Movie First Glimpse Released
ఈ సంద‌ర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ “కోవిడ్ టైమ్ లో నేను బతుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది నేను సినిమాలు చేస్తానా లేదా.. అనుకున్నాను. ఎందుకంటే.. నేను హాస్పిటల్లో లేవలేక, నడవలేక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను. అయితే ఈ రోజు నేను మీ ముందు నిలుచున్నాను అంటే మీ అందరూ బ్లెస్సింగ్స్ వల్లే.  అందరికీ నా ధన్యవాదాలు. నేను కోలుకున్న తరువాత ఈ ‘శేఖర్’ సినిమా చేయడం జరిగింది.  ఈ సినిమాకు నేను ఎంత కష్టపడ్డాము అంటే.. 10 సినిమాలు చేసినంత కష్టం ఈ సినిమాకు కష్టపడ్డాను. అందరం ఈ సినిమాకు ప్రాణం పెట్టి తీశాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జీవిత. తను మా వెనుకుండి నడిపించింది. దాని ఫలితం ఈ సినిమాలో కనిపిస్తుంది. మీరందరూ ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Also Read : పోలీసు పాత్రలకు పెట్టింది పేరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular