అవికా గోర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే అందరికీ తెలుసు. అందువలన ఆమె టీనేజ్ హీరోయిన్ గా పరిచయం చేసుకోవడానికి కష్టపడవలసిన అవసరం లేకుండా పోయింది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగులో ఆమె ప్రయాణం మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద బ్యానర్లో  ఎంట్రీ ఇవ్వడమే ఆమె చేసుకున్న అదృష్టమని అంతా చెప్పుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె అదృష్టవంతురాలే అనే విషయం నిర్ధారణ అయింది.

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో ముద్దుగా .. బొద్దుగా కథకి తగినట్టుగా .. పాత్రకి తగినట్టుగా అవికా అలరించింది. ఈ సినిమాతో ఆమె అభిమానుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఆ తరువాత అవికా చేసిన ‘సినిమా చూపిస్తమావా’ .. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి  విజయాలు ఆమె అభిమానులను ఖుషీ చేశాయి. ఇక లవ్ స్టోరీస్ కి ఈ అమ్మాయి కేరాఫ్ అడ్రెస్ గా మారటం ఖాయమనే టాక్ బలంగా వినిపించింది. కానీ అలా జరగలేదు.

వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్న సమయంలో అవికా టాలీవుడ్ కి దూరమైంది. చాలా గ్యాప్ తరువాత వచ్చి అందుకు గల కారణాలను చెప్పడానికి ట్రై చేసింది. అంతేకాదు ఎవరు సలహా  ఇచ్చారో తెలియదుగానీ .. అవికా బాగా సన్నబడి తన ఆకర్షణను కోల్పోయింది. దాంతో అవకాశాలు మునుపటిలా రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన సినిమానే ‘పాప్ కార్న్’. ఈ నెల 10వ తేదీలేన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. నిర్మాణ భాగస్వామిగా మారిపోయి అవికా చేసిన ఈ సినిమా, ఆమె గ్రాఫ్ ను పెంచుతుందేమో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *