Saturday, January 18, 2025
Homeసినిమాపాయల్ 'మంగళవారం'తో మళ్లీ పుంజుకోనుందా?

పాయల్ ‘మంగళవారం’తో మళ్లీ పుంజుకోనుందా?

పాయల్ రాజ్ పుత్ .. యూత్ లో ఈ పేరుకి ఎంతో క్రేజ్ ఉంది. టాలీవుడ్ కి చెందిన పొడగరి భామల్లో ఒకరుగా పాయల్ కనిపిస్తుంది. పాయల్ కి కొన్ని పరిస్థితుల్లో ఆమె  హైట్ ప్లస్ అయితే, మరి కొన్ని పరిస్థితుల్లో ఆమె హైట్ మైనస్ అయిందనే చెప్పాలి. ఇక హైట్ సంగతి అలా ఉంచితే సరైన పాత్రలు వచ్చేంత వరకూ వెయిట్ చేయకపోవడమే ఆమెకి రావలసినంత క్రేజ్ రాకపోవడానికి కారణమనే టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది.

పాయల్ కి హాట్ బ్యూటీగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘RX 100’ తరువాత కాస్త రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న పాత్రలో ఆమెను మళ్లీ చూడాలనే ఆసక్తితో కుర్రాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మళ్లీ అజయ్ భూపతి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ‘మంగళవారం‘ టైటిల్ తో ఈ సినిమా రూపొందింది. విలేజ్ నేపథ్యంలో వివిధ కోణాలను ఆవిష్కరించే కథ ఇది. టైటిల్ తో పాటు పాయల్ గ్లామర్ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.

‘RX 100’ తరువాత పాయల్ కి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె ఎంపిక సరిగ్గా లేకపోవడం వలన ఫలితాలు నిరాశ పరిచాయి. అందువలన ఆమె కొంత వెనకబడింది. ‘మంగళవారం’ కంటెంట్ .. పాయల్ పాత్రను చూస్తుంటే మాత్రం ఆమె కెరియర్ మళ్లీ పుంజుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఈ సారి ఆమె తన పాత్రలపై .. ప్రాజెక్టులపై సరైన దృష్టి  పెట్టవలసి ఉంటుంది. సరైన ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటే మాత్రం పాయల్ కెరియర్ కి మరికొంతకాలం ఢోకా లేనట్టే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్