1.2 C
New York
Tuesday, November 28, 2023

Buy now

HomeTrending NewsLokesh: పులివెందులలో పునాదులు కదులుతున్నాయి

Lokesh: పులివెందులలో పునాదులు కదులుతున్నాయి

సిఎం జగన్ కు కళ్ల ముందు తన దారుణ ఓటమి కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ ప్రజా విశ్వాసం కోల్పోయాడని…చివరికి సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో, పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని….ఈ ఫ్రస్టేషన్లోనే అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రొద్దుటూరు ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవిల అరెస్టుతో ప్రతిపక్షం అంటే ఎంతగా భయపడుతున్నాడో అర్థమవుతోందని పేర్కొన్నారు. రోజుకో టీడీపీ ఇంచార్జ్ అరెస్టు జగన్ లో మొదలైన అలజడికి నిదర్శనమన్నారు.

కడప జిల్లాలో, పులివెందులలో తీవ్ర వర్షాభావంతో రైతులు బాధలుపడుతుంటే, ఈ సమస్యపై దృష్టిపెట్టని సిఎం….ప్రతి పక్ష నేతలపై అక్రమ కేసులే తనకు ప్రాధాన్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. సిఎంగా ఉండి సొంత నియోజకవర్గ రైతుల సమస్యలు తీర్చలేని జగన్….చివరికి పులివెందుల ప్రజల నమ్మకాన్ని కూడా కోల్పోయారన్నారు. ప్రతిపక్ష నేతల కేసులపై  సమీక్షలు చేస్తోన్న  జగన్….ముందు రైతాంగ సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఏ సిఎం అయినా సొంత జిల్లాలో తాను చేసిన అభివృద్ది పనుల గురించో…కట్టిన ప్రాజెక్టుల గురించో…తెచ్చిన కంపెనీల గురించో చెప్పుకుంటారు..కానీ జగన్ మాత్రం ఏ నియోజకవర్గంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టానో మాత్రమే చెప్పుకోగలరని ఎద్ణిదేవా చేశారు.

తన చర్యలతో తన పార్టీకి తానే జగన్ రాజకీయ సమాధి కట్టుకున్నారని…ఈ అక్రమ కేసులు, బెదిరింపు రాజకీయాలు వైసీపీని బతికించలేవని లోకేష్ అన్నారు. అక్రమ పద్దతుల్లో సహకరిస్తున్న పోలీసులు లేకపోతే….రాష్ట్రంలో వైసీపీని పార్టీ యే లేదని అన్నారు. జగన్ పెట్టే ప్రతి కేసు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతుంది తప్ప…ప్రజల పక్షాన తమ పోరాటాన్ని ఆపబోమని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్