Monday, June 15, 2026
Homeసినిమాహిట్టు కోసం కష్టపడుతున్న కార్తికేయ! 

హిట్టు కోసం కష్టపడుతున్న కార్తికేయ! 

కార్తికేయ పేరు వినగానే ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో రొమాన్స్ పరంగా  ఆయన చేసిన సందడి గుర్తుకు వస్తుంది. కార్తికేయ యాక్టింగ్ విషయాన్ని పక్కన పెడితే, ఆయన ఫిజిక్ కి ఉన్న క్రేజ్ ఎక్కువనే ఒప్పుకోవాలి. ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గని కార్తికేయ, ఆశించిన స్థాయిలో సక్సెస్ లను అందుకోలేక వెనకబడిపోతున్నాడు. కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది.

ఒక వైపున హీరోగా కుదురుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున విలన్ గాను తన మార్క్ చూపించడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అలా ‘వలిమై’ వంటి పెద్ద సినిమా చేసినా, అది కూడా విజయానికి వీలైనంత దూరంలోనే ఉండిపోయింది. అజిత్ సినిమాలో మెయిన్ విలన్ గా ఛాన్స్ రావడం అంత ఆషామాషి విషయమేంకాదుగానీ, అది ఆయన కెరియర్ కి హెల్ప్ కాలేకపోయింది. ఆ తరువాత హీరోగా ఆయన చేసిన సినిమానే ‘బెదురులంక 2012’.

ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ వచ్చింది. టీజర్ లో కొంత కథ చెప్పడానికి ట్రై చేశారు. ఒక వైపున లవ్వు .. ఇంకోవైపు ఏవేవో హడావిళ్లు చూపించారు. బడ్జెట్ పరంగా చూసుకున్నా .. తారాగణం పరంగా చూసుకున్నా, కార్తికేయ ఇంతకుముందు చేసిన సినిమాలకంటే ఇది చిన్నదిగానే కనిపిస్తున్నా, కంటెంట్ పరంగా బలమైనదై ఉండొచ్చు. ఎందుకంటే ఇకపై తన సినిమాల ఎంపిక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆ మధ్య ఆయనే చెప్పాడు. మార్చి 3వ తేదీన రానున్న ఈ సినిమా, ఆయన ఎదురుచూస్తున్న హిట్టు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Also Read :  ‘బెదురులంక 2012’లో ‘చిత్ర’గా నేహా శెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular