Sunday, September 8, 2024
HomeTrending Newsjagannath Rath Yatra: రథ యాత్రకు ముస్తాబైన పూరి నగరం

jagannath Rath Yatra: రథ యాత్రకు ముస్తాబైన పూరి నగరం

జగన్నాథుడి  రథయాత్ర కోసం ముస్తాబైన పూరి నగరం భక్తులతో కోలాహలంగా మారింది. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర సమేతుడైన శ్రీకృష్ణుడి రథ యాత్రలో పాల్గొని తరించేందుకు దేశ విదేశాల నుంచి లక్షల్లో భక్తులు పూరి చేరుకున్నారు. మరి కొద్ది సేపట్లో జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. రథ యాత్ర సాగే వీధుల్లో దేవదేవుడికి స్వాగతం పలికేందుకు రంగవల్లులతో చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు.

పూరీ, అహ్మదాబాద్‌లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుని రథం కదిలేందుకు సిద్దమైంది. ఒడిశాలోని పూరీలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోగల జగన్నాథ స్వామి ఆలయాల్లో అంగరంగ వైభవంగా ఈ పవిత్రయాత్రను నిర్వహిస్తున్నారు. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ ఇప్పటికే భక్తులతో కళకళలాడుతున్నాయి.

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. పూరీలో జరిగే రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం జగన్నాథుడు అంటే విశ్వమంతటికి నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం. పూరీ నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడంవల్ల అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలాలు లభిస్తాయని విశ్వాసం.

ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.. సముద్ర తీరంలో ఓ అద్భుతాన్ని సృష్టించారు. బంగాళాఖాతం తీరానగల పూరీ బీచ్‌లో పూరీ జగన్నాథ రథయాత్రను ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పం రూపకల్పనలో రకరకాల రంగులను పట్నాయక్‌ వినియోగించారు. అదేవిధంగా 250 కొబ్బరికాయలను కూడా సుదర్శన్‌ పట్నాయక్‌ ఈ సైకత శిల్పం కోసం ఉపయోగించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్