Saturday, January 18, 2025
Homeసినిమాఅల్లరి నరేష్ ‘సభకు నమస్కారం’

అల్లరి నరేష్ ‘సభకు నమస్కారం’

Allari Naresh New Movie Titled As Sabhaku Namaskaram :

‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయమై.. తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకుని.. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరు చేసుకున్నారు నరేష్‌. కామెడీ సినిమాలతో పాటు ఎమోషనల్ మూవీస్ లో కూడా నటించి మెప్పించారు. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను అద్భుతంగా పోషించి శభాష్ అనిపించుకున్నారు. ఈ రోజు అల్లరి నరేష్ పుట్టినరోజు. పలువరు సినీ ప్రముఖులు, స్నేహితులు అల్లరి నరేష్ కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ ‘సభకు నమస్కారం’. ఇది అల్లరి నరేష్ కు 58వ చిత్రం. టైటిల్‌కు తగ్గట్లుగానే.. ఈ మూవీ పోస్టర్‌లో కూడా సభకు నమస్కారం చేస్తుండటం ప్రత్యేకతను కనబరుస్తోంది. ఈ చిత్రాన్ని ఈస్ట్‌ కోస్ట్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి మల్లంపాటి సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. సభకు నమస్కారం చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

Also Read : వస్తున్నాడు హీరో! దూరం దూరం జరగండి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్