Tuesday, June 16, 2026
HomeసినిమాAllu Arjun: తెగ వైరల్ అవుతోన్న బన్నీ, ఎన్టీఆర్ చాట్

Allu Arjun: తెగ వైరల్ అవుతోన్న బన్నీ, ఎన్టీఆర్ చాట్

Jr NTR: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య మంచి అనుబంధం ఉంది. బావ, బావ అని పిలుచుకుంటారు. ఈ విషయం అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా వీరి బంధం మరోసారి బైటపడింది.  బన్నీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషేస్ తెలియచేశారు. ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా అల్లు విషేస్ తెలియచేశారు.

‘హ్యాపీ బర్త్‌డే బావా. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీనికి రిప్లైగా బన్నీ.. ‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్’ అంటూ బదులిచ్చారు. దీనికి వెంటనే ప్రతిస్పందించిన ఎన్టీఆర్.. ‘కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా?” అంటూ పుష్ప సినిమా డైలాగ్‌ను గుర్తుకు తెస్తూ ట్వీట్ చేశారు. దీంతో.. బన్నీ కూడా ‘వస్తున్నా’ అంటూ ఎన్టీఆర్ 30లోని డైలాగ్‌ తో సమాధానమిచ్చారు. ఇద్దరు స్టార్లు ఒకరి సినిమాల్లో పాపులర్ డైలాగ్స్‌ను మరొకరు ప్రస్తావిస్తూ సాగించిన సంభాషణ నెటిజన్లకు బాగా నచ్చింది.

కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ మూవీ చేస్తున్నారు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఇది విడుదల కానుంది.  అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో బిజీగా ఉన్నారు.  రెండ్రోజుల క్రితం విడుదలైన  పుష్ప 2 టీజర్ ట్రెమండస్ రెస్సాన్స్ సంపాదించింది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఈ సినిమాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular