Thursday, June 18, 2026
HomeసినిమాAllu Arjun - Sanjay Leela Bhansali: బన్నీతో భన్సాలీ నిజమేనా..?

Allu Arjun – Sanjay Leela Bhansali: బన్నీతో భన్సాలీ నిజమేనా..?

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్ లో బన్నీకి మరింతగా క్రేజ్ పెరిగింది. ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్స్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ చేస్తున్నాడు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి కానీ.. సమ్మర్ లో కానీ విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నాడు. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఆమధ్య ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

అయితే.. ఇటీవల బన్నీ రెండు సినిమాలను అనౌన్స్ చేయనున్నాడని.. ఒకటి త్రివిక్రమ్ తో సినిమా కాగా, మరొకటి సురేందర్ రెడ్డితో మరో సినిమా అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ పేరు వినిపిస్తుంది. పుష్ప రిలీజ్ తర్వాత బన్నీ ముంబాయి వెళ్లి భన్సాలీని కలిసారు. అప్పుడే వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత అలాంటిది ఏమీ లేదు.. కేవలం ఓసారి కలుద్దామంటే వచ్చాను అని బన్నీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బన్నీతో భన్సాలీ సినిమా చేసేంందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని టాక్.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల తర్వాత టాలీవుడ్ స్థాయి బాగా పెరిగింది. అందుకనే టాలీవుడ్ వైపు బాలీవుడ్ చూస్తుంది. ఎలాంటి క్యారెక్టర్ లో అయినా పర్ ఫెక్ట్ అనేలా నటించగల బన్నీ… సంజయ్ లీలా భన్సాలీకి దొరికితే ఆ సినిమా ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప 2 తర్వాత లైనప్ బాగుండేలా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి బన్నీ, భన్సాలీ కలిసి సినిమా చేస్తే.. సంచలనమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular