Friday, April 19, 2024
Homeసినిమాబ‌న్నీకి హాలీవుడ్ ఆఫ‌ర్.?

బ‌న్నీకి హాలీవుడ్ ఆఫ‌ర్.?

తెలుగు ఇండస్ట్రీ… బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ని కూడా  షేక్ చేస్తోంది.  బాహుబ‌లి, పుష్ప‌, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా స‌త్తా చూపించింది. ‘ఆర్ఆర్ఆర్’ని ఓటీటీలో రిలీజ్ చేయ‌డంతో హాలీవుడ్ కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. హాలీవుడ్ మేక‌ర్స్ ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిపై ప్ర‌శంసల వ‌ర్షం కురిపిస్తున్నారు.

అలాగే పుష్ప సినిమాని కూడా హాలీవుడ్ మేక‌ర్స్ అభినందిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించారంటూ అభినందిస్తున్నారు. ఇటీవ‌ల న్యూయార్క్ సిటీలో జ‌రిగిన ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల్లో అల్లు అర్జున్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ వేడుక‌లు అనంతంరం బ‌న్నీని హాలీవుడ్ డైరెక్ట‌ర్ ఒకరు కలిసినట్లు తెలిసింది.

బ‌న్నీ యాక్టింగ్ కి ఫిదా అయిన ఆ డైరెక్ట‌ర్ తన మూవీలో న‌టించ‌మ‌ని ఆప‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అయితే.. బ‌న్నీ పీఆర్ టీమ్ మాత్రం ఈ వార్త పై స్పందించ‌లేదు. అలాగే బ‌న్నీ కూడా రియాక్ట్ కాక‌పోవ‌డంతో ప్ర‌చారంలో ఉన్న వార్త నిజ‌మే అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా బ‌న్నీ హాలీవుడ్ మూవీ చేస్తే.. సంచ‌ల‌న‌మే. అభిమానుల‌కు పెద్ద పండ‌గే.

Also Read : ‘ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022’ కి అల్లు అర్జున్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్