Allu Arjun Is My Ever Green Inspiration Says Vijay Devarakonda :
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం“. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్నితెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్రైలర్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి స్క్రిప్టులు, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ లాంటి ప్రతిభ గల దర్శకులు పక్కనే ఉన్నా నిర్మాతలు ఎవరూ లేక ఆ సినిమాలు చేయలేని పరిస్థితిని చూశాను. ఆ కష్టాలు చూసిన అనుభవంతో టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలి అనే సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. నా కింగ్ ఆఫ్ హిల్ ఎంటర్టైన్మెంట్స్ లో రెండో ప్రాజెక్ట్ ‘పుష్పక విమానం’. దామోదర నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నుంచీ తెలుసు. ఆయన అప్పుడు రైటర్ గా కథలు రాసేవారు. నాకు ఓ కథ చెప్పారు నచ్చింది, సినిమా చేద్దామనే ఆలోచన ఉండేది. ఆ స్నేహం అలా కంటిన్యూ అయ్యింది. దామోదర మా ప్రొడక్షన్ లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఒక నిర్మాతగా దామోదర వర్క్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. మంచి కథ కాబట్టి నాన్న గోవర్థన్, తమ్ముడు ఆనంద్ ఈ ప్రాజెక్ట్ చేయాలని పట్టుబట్టారు. ఈ కథలో హీరో క్యారెక్టర్ కు చాలా కష్టాలుంటాయి. అతనికి కష్టాలు గానీ మనకు నవ్వొస్తాయి. సునీల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓ పిల్లర్. గీత్ సైని, శాన్వి మేఘనా సూపర్బ్ గా నటించారు. బన్నీ అన్న మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మా నాన్నతో కలిసి డాడీ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో బన్నీ అన్న చేసిన డాన్సులు ఫిదా అయ్యాను. ఆర్య సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ పర్మార్మెన్స్, డాన్సులు చూసి అద్భుతంగా చేశాడు అనిపించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారంటే బాగా ఇష్టం. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి వల్ల మేము మరింత దగ్గరయ్యాం. బన్నీ అన్న, మహేష్ గారు లాంటి స్టార్స్ సినిమా ఫంక్షన్ లో నా గురించి మాట్లాడటం కలా నిజమా అనిపించేది”
“అన్నా, మీ టాలెంట్, లక్ ఈ టీమ్ కు కూడా ఉండాలి. వీళ్లు మంచి సినిమాలు చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బెస్ట్ స్టేజ్ లో ఉంది. బన్నీ అన్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ గారు చేస్తున్న సినిమాలు తెలుగు సినిమా గ్రేట్ నెస్ చూపిస్తున్నాయి. అల్లు అర్జున్ అన్న వర్క్ చూసి ప్రతి రోజూ ఇన్ స్పైర్ అవుతుంటాను. పుష్ప సినిమాకు మీరు పడిన కష్టం చూస్తుంటే మనం కూడా ఇలా కష్టపడాలి అని అనిపిస్తుంటుంది. మాకు ఎప్పుడూ ఇన్సిపిరేషన్ గా మీరు ఉండటం సంతోషంగా ఉంది. మీరు, సుక్కు సార్ కలిసి పుష్పలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. బన్నీ అన్నను పుష్పరాజ్ గానే చూస్తున్నాను. ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నాను. పుష్పక విమానం నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. థియేటర్లలో చూసేయండి. పునీత్ అన్నను కోల్పోయాం. ఆయనను రెండు మూడు గంటలు మాత్రమే కలిశాను. అయినప్పటికీ.. నిన్నటి నుంచి మనసులో ఆయన ఆలోచనే ఉంటూ వస్తోంది. జీవించి ఉన్నంతకాలం సంతోషంగా ఉందాం, ప్రేమిద్దాం, స్నేహంగా ఉందాం. లవ్ యూ ఆల్” అన్నారు.