Friday, March 13, 2026
Homeసినిమావైష్ణవికి అవార్డు రావలసిందే: అల్లు అర్జున్ 

వైష్ణవికి అవార్డు రావలసిందే: అల్లు అర్జున్ 

సినిమాలను ఎక్కువగా యూత్ చూస్తుంది. ఇక ప్రేమకథల నేపథ్యంలో వచ్చే సినిమాలను చూడటానికి వాళ్లు మరింత ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఏ మాత్రం కాస్త కంటెంట్ కనెక్ట్ అయినా ఇక ఆ సినిమా హిట్ చేయకుండా వదిలిపెట్టరు. అలా రీసెంటుగా వచ్చిన ప్రేమకథగా ‘బేబి’ సినిమా కనిపిస్తుంది. సాయిరాజేశ్ నీలం దర్శకత్వం వహించిన ఈ సినిమా, హిట్ టాక్ తెచ్చేసుకుంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖుల ప్రశంసలు మొదలయ్యాయి.

ఈ సినిమాలో పాత్రల పరంగా చూసుకుంటే ఒకరిది ప్రేమ సామ్రాజ్యం .. మరొకరిది ఆకర్షణ ప్రపంచం. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ గనుక, ఈ ఇద్దరి మధ్యలోకి అవకాశవాదంతో మరో వ్యక్తి ఎంటరవుతాడు. ఈ ముగ్గురి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఈ సినిమా టీమ్ ను అభినందిస్తూ నిన్న రాత్రి జరిగిన ఈవెంటులో అల్లు అర్జున్ మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో తనకి చాలా బాగా నచ్చేసిన ప్రేమకథగా ఈ సినిమాను గురించి చెప్పాడు. ఇప్పుడు హీరోలుగా వస్తున్న వాళ్లు ఎవరి ప్రత్యేకతను వాళ్లు చాటుకోవలసిందే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక ఆయన వైష్ణవి గురించి ఎక్కువగా మాట్లాడాడు. ఆ అమ్మాయి నటన అదిరిపోయిందనీ ..  తెలంగాణ యాసలో చాలా గొప్పగా చేసిందనీ .. ఆమె యాక్టింగ్ కి అవార్డు రావలసిందేనని అన్నాడు. ఈవెంటుకి తాను రావడానికి సగం కారణం ఈ సినిమా టీమ్ అయితే, మరో సగం కారణం వైష్ణవి అని చెప్పాడు. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో అక్కడి అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారనీ, ఇక్కడ కూడా తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని అన్నాడు. పేరెంట్స్ ను ఒప్పించి రావాలనీ, తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పదని చెప్పుకొచ్చాడు. చూస్తుంటే ‘బేబి’ హిట్ వైష్ణవి కెరియర్ గ్రాఫ్ ను పరిగెత్తించేలానే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular