Monday, March 16, 2026
Homeసినిమాఐకాన్ స్టార్ కు సిఎన్ఎన్ -న్యూస్ 18 అవార్డు

ఐకాన్ స్టార్ కు సిఎన్ఎన్ -న్యూస్ 18 అవార్డు

‘పుష్ప: ది రైజ్’ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు. ఈ విజయంతో న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించారు.  SIIMAలో ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును కూడా గెల్చుకున్న అల్లు అర్జున్ ఇప్పడు మరో ప్రతిష్టాత్మక అవార్డు సాధించారు. ఎంటెర్టైనమెంట్ విభాగంలో CNN-News18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల తర్వాత దక్షిణ భారత నటుడికి ఇదే తొలి అవార్డు. ఢిల్లీలో అల్లు అర్జున్‌కు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అవార్డును అందజేశారు. అవార్డును స్వీకరించే సమయంలో,తన విలక్షణమైన శైలిని ప్రదర్శించారు అల్లు అర్జున్. అవార్డును స్వీకరిస్తూ… “భారతీయ సినిమా, ఇండియా కభీ ఝుకేగా నహిం (భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తగ్గేదేలే)” అని పుష్ప రాజ్ చెప్పిన డైలాగ్‌ను అల్లు అర్జున్ తనదైన శైలిలో మరోసారి చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా పని చేస్తున్నాను. నేను దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఉత్తరాది నుంచి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకం’’ అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ మాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం మహమ్మారి సమయంలో విడుదలైనందున, అల్లు అర్జున్ ఈ అవార్డును డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు మరియు వాలంటీర్లు వంటి “COVID వారియర్స్”కి అంకితం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular