Thursday, April 18, 2024
Homeసినిమాబన్నీ, సందీప్ రెడ్డి కాంబో మూవీ

బన్నీ, సందీప్ రెడ్డి కాంబో మూవీ

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. బన్నీ నెక్ట్స్ మూవీ కోసం స్టార్ డైరెక్టర్స్ బోయపాటి శ్రీను, మురుగుదాస్, వేణు శ్రీరామ్, విక్రమ్ కె కుమార్, అట్లీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే.. వీళ్లెవరితో కాకుండా సందీప్ రెడ్డి వంగతో సినిమా అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశాడు ఐకాన్ స్టార్. ఈ క్రేజీ కాంబో మూవీని టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.

కొద్ది రోజుల క్రితం బన్నీ, సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్ కలిసి స్క్రిప్ట్ ఫైనల్ చేసుకొని తీసుకున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు ది కాస్తా వైరల్ అవుతుంది. ఇక టి-సిరీస్ తో పాటు సందీప్ రెడ్డి వంగా హోమ్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండబోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ తో హిందీలో పాన్ ఇండియా మూవీగా ‘యానిమల్’ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు.

స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ తో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే.. ఈ సినిమా కంటే ముందు బన్నీ.. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ లైనప్ అదిరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్