Tuesday, March 17, 2026
HomeTrending Newsఏపీలో  అల్యూమినియం కాయిల్ యూనిట్

ఏపీలో  అల్యూమినియం కాయిల్ యూనిట్

Dubai Expo: ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ను అబుదాబీలోని అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది.  రూ.1500 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమ  నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.  ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం  ముందుకువెళుతోంది. ఇప్పటికే 4 ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీఈడీబీ నేడు మరో కీలక అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ ఏర్పాటు దిశగా  చేసిన ప్రయత్నాలు ఫలించాయి.  ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రమణ్యం, అలుబండ్ గ్లోబల్ ఛైర్మన్ షాజి ఎల్ ముల్క్ ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. 200 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అలుబండ్ గ్లోబల్ పరిశ్రమకు అవసరమైన 150 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది.

మంత్రి మేకపాటి  అబుదాబీలోని అబుదాబీ ఇండస్ట్రియల్  డెవలప్ మెంట్ అథారిటీ, జీ43, ముబాదల గ్రూప్ లతో వరుసగా సమావేశమయ్యారు.”జీ42″ సంస్థ ప్రతినిధులతో  జరిగిన సమావేశంలో మౌలిక వసతులకు సంబంధించిన ఫండింగ్ పై  ప్రధానంగా చర్చించారు. జీ42 ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ కు రావాలని, అక్కడి వసతులను పరిశీలించాలని  పరిశ్రమల శాఖ మంత్రి ఆహ్వానం పలికారు. పరిపాలన, నైపుణ్య మానవవనరులు, మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాల ఏపీ ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.  జీ42 కంపెనీ గురించి సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫేలే బ్రెస్చి మంత్రి మేకపాటికి వివరించారు. ఐ.టీకి సంబంధించిన నైపుణ్యం గల యువతకు భారత్, ఏపీలో కొదవలేదన్నారు. ఎనర్జీ, స్మార్ట్ సిటీ, హెల్త్ కేర్, నైపుణ్యం, విద్య, డిజిటల్ గవర్నమెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్, ఐ.టీ, టెక్నాలజీ తదితర రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలపైనా చర్చించారు. ఈ కార్యక్రమంలో “జీ42” గ్రూప్ సీఓఓ మన్సూర్ అల్ మన్సోరి, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫెలే బ్రెస్చి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రతీక్ భరదర్వాజ్, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ తరిఖ్ బిన్ హెండి, హెల్త్ కేర్ సీఈవో అశిష్ కోషి, తదితరులు పాల్గొన్నారు.

Also Read : మూడు కంపెనీహతో ఏపీ ఎంవోయులు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular