Saturday, March 14, 2026
HomeTrending Newsమాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం

మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం

కర్నూల్ జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కర్నూలు నుంచి హైదరాబాద్ కు తన ఫార్చునర్ కారు లో వెళుతుండగా బీచుపల్లి వద్ద వెనుక టైరు పగలడ0తో కారు పల్టీలు కొట్టింది.  ఈ ప్రమాదం లో నీరజా రెడ్డి తల, శరీరం పై తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమె ను కర్నూలు ఆసుపత్రి కి తరలించగా  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈమె భర్త శేషురెడ్డి  1996లో ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురయ్యారు.  2009 లో ఆలూరు నుంచి  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరిన ఆమె ఆ తర్వాతా బిజెపిలో చేరారు.  ప్రస్తుతం నీరజా రెడ్డి ఆలూరు బిజెపి  ఇంఛార్జి గా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular