Saturday, November 23, 2024
HomeTrending Newsబాబు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: అంబటి

బాబు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: అంబటి

చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా సమ సమాజం, అంబేద్కరిజం గుర్తుకు వచ్చిందని, 44 ఏళ్ళ రాజకీయ జీవితంలో, 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఇలాంటివి గుర్తుకు రాలేదని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు మాత్రమే గుర్తుంటారని, అధికారం పోయేసరికి అంబేద్కర్‌గారి ఆశయాలు, సమ సమాజం గుర్తుకొవస్తున్నాయని విమర్శించారు. తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన ఓ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందించారు.

ఇటీవలి సర్వేలు వెల్లడించిన దానికి భిన్నంగా 23 సీట్లే కాదని 25 ఎంపీ సీట్లను కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ గెలుస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు. ఈ సర్వేలు నిజమైతే తనకు రిటైర్మెంట్‌ తప్ప మరో మార్గమే లేదని తెలిసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

  • విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అయితే మీరెందుకు తీసుకున్నారు?
  • కేంద్రం నిర్మిస్తే ఆలస్యం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడితే త్వరగా అవుతుందని చెప్పారు. 2018కి ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని చెప్పిన మీరు ఎందుకు చేయలేకపోయారు?
  • ప్రపంచంలో ఎక్కడైనా సరే కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసిన తర్వాత మాత్రమే డయాఫ్రం వాల్‌ చేపడతారు. కాని అలా ఎందుకు చేయలేదు?

అంటూ ప్రశ్నలు సందించారు.

రాష్ట్రంలో మరే సమస్యలూ లేనట్లు ఎంపీ మాధవ్‌ వ్యవహారాన్ని పట్టుకుని ఇంకా ఇంకా లాగుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అసభ్యకరమైన, మార్ఫింగ్‌ వీడియోను పట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు చంద్రబాబు రాజకీయం అంతా దాని చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. అహంకారం, ఫ్రస్ట్రేషన్‌తో జగన్‌ ను ఏదిపడితే అది మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో ఇది సరైన విధానం కాదని అంబటి హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్