6.1 C
New York
Monday, December 11, 2023

Buy now

మనం మారాలి

Health-Nature: సాధారణంగా వానాకాలంలో  జలుబు, జ్వరాలు ఉండేవి. రెండేళ్లుగా తగ్గాయి. ఇప్పుడు భారీ సంఖ్యలో….. గతానికంటే ఎక్కువగా పెరిగాయి.

ఎందుకు?
మనిషన్నోడికి-ఎక్కడ పుట్టినా, వయసెంతైనా ..  ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. అదే చుట్టూరాఉన్న సూక్ష్మజీవుల దాడి నుంచి కాపాడుతుంది.

గాలిలో, నేలలో, గడ్డిలో, నీటిలో..  ఎక్కడ చూసినా వైరస్ లు. బాక్టీరియాలు.  అవి మనకంటే ముందే భూమి మీద పుట్టాయి. మనం పొమ్మన్నా పోవు.  అవి నిజంగా పొతే ఇక మనం ఉండం…. మన జీవితం వాటితో అంతగా పెనవేసుకొని పోయింది.

ఇప్పుడైతే బెంగళూరు.. ముంబై.. న్యూయార్క్. కానీ…టైం లైన్ లో వెనక్కు వెళితే నూటికి తొంబై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సమయం మనిషి ప్రకృతి ఒడిలో గడిపాడు. దానికి తగినట్టుగా మనిషికి సూక్ష్మ పరిణామక్రమంలో  ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. నీకు ఇష్టమున్న లేకున్నా అది వచ్చి చచ్చింది. నిన్ను చావకుండా కాపాడింది అదే.

క్రికెటర్ ఉంటాడు. ఇంట్లో తిని పడుకుంటే? ఒక రోజు కూడా గ్రౌండ్ కెళ్ళి ప్రాక్టీస్ చేయకపోతే? మ్యాచ్ లో సున్నాకే అవుట్ అయిపోతాడు. అంతేనా?

ఇమ్యూనిటీ కూడా అంతే
దానికి రోజూ బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి.
దానికి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఏమిటి?

వైరస్ లు .. బాక్టీరియాలు .. అప్పుడప్పుడు .. సహజసిద్ధంగా .. కొద్ధి మొత్తంలో సోకడం .. దాన్ని ఇమ్యూనిటీ చంపెయ్యడం… ఇదే మనిషి జీవితం నలభై లక్షల సంవత్సరాలుగా…

కరోనా పేరుతో.. పిల్లలకు మాస్కులువేసి ఇంటి గడప దాటకుండా , ఎండ సోకకుండా , ఆటలు పాటలు లేకుండా…. రెండేళ్లు ఇంట్లో బందీలుగా పెంచితే ?

ఇమ్యూనిటీని బజ్జోపెట్టేస్తే? జరిగేది ఇదే!

ఇప్పుడేంటి మార్గం? జలుబు సోకకుండా ఫ్లూ వాక్సిన్… ఇంకో వాక్సిన్ .. మొఖానికి మాస్క్ .. స్టే హోమ్ ..

ఇప్పటిదాకా స్టే హోమ్?
పిల్లలకు ADHD వచ్చిందాకా! ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లు వచ్చిందాకా! ఎలర్జీ లు వచ్చిందాకా ! సెల్ ఫోన్ అడిక్షన్ ముదిరి మానసిక వ్యాధుల మందులు అవసరం అయిందాకా!

ఇక మీ కోసం ..

1 . పిలల్లు ఆడాలి .. పాడాలి.. ఎగరాలి .. దూకాలి .. రోజు .. ప్రతి రోజూ ..

2 . కనీసం పది నిముషాలు ఎండ సోకాలి.

3 . జంక్ ఫుడ్ వద్దు. అది విషం. పిజ్జాలు బర్గర్ లు .. కోక్ .. పెప్సి. నూడుల్స్.  ప్యాకెట్లో వచ్చే పొటాటో చిప్స్ .. ఆ మాటకు వస్తే ప్యాకెట్లో వచ్చే ప్రతిదీ అనారోగ్యమే ..

Nature

4 . పాలు ఓకే. కానీ మీరు అనుకొన్నట్లు అదేమీ సంపూర్ణ ఆహారం కాదు. అసలు పాలను చంపేశారు. ఇప్పుడు దొరికేది పాలు కాదు .. పాపాలు ..

5 . తాజా ఆకు కూరలు .. పళ్ళు .. డ్రై ఫ్రూప్ట్స్ .. నట్స్ .. నువ్వుల లడ్డు .. కొబ్బరి .. బెల్లం .. తేనే .. ఇలా బండిపై దొరికేవి ఇంచుమించు అన్నీ అమృత ఆహారమే!

6 . వయసు బట్టి రెండు లీటర్ల దాకా నీరు తాగాలి.

7 . మాస్క్ లు వద్దు.

8 . కొద్దిపాటి జలుబు దగ్గుకు ఆందోళన వద్దు .. అవి వస్తుంటాయి. పోతుంటాయి .. ఇదే జీవితం .

-వాసిరెడ్డి అమరనాథ్

Also Read :

1986 గోదావరి వరదల చేదు జ్ఞాపకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్